Wednesday 23 December 2009

pelli





నిన్నటి రోజంతా ఏదో వెలితిగా వుంది.
ఏదో తెలియని శూన్యత మనసంతా పరుచుకుంది.

సంధ్య వారుతుండగా, సిస్టం ఆన్ చేసాను.
ముద్దగా, మురిపెంగా నవ్వతూ తుళ్ళుతున్న నీ నిలువెత్తు రూపాన్ని చూసి, మనసంతా ఏవో కొత్త ఊహలతో నిండిపోయింది.
శూన్యత,వెలితి మాయమై వర్ణింప సాధ్యపడని కొత్త భావమేదో మనసంతా అల్లుకుపోయింది.

నీ మెరిసే కళ్ళలో నన్ను నేను చూసుకుంటూ, అలానే నిద్రపోయాను కుర్చీలో.
అందమైన కల,

..............................................................................................................................................

గవర్నమెంట్ పాల డైరీ ఫారంలో పనిచేసే దారం రామారావు అప్పుడే పాల బెల్లు కొడుతున్నాడు.
అయితే ఇప్పుడు ఇది ఉదయం 4.30 గంటల సమయం.

ఆకాశం నుండి తెరలు దించినట్లు, తెల్లటి మంచు, సంక్రాంతికి అమ్మమ్మ దంచే బియ్యపు పిండి, జల్లులా కురుస్తున్నట్లుంది,
చుక్కలన్నీ పొద్దునే స్కూల్లో ప్రేయర్ కి నిలబడ్డ పిల్లల్లా, చక్కగా బంధుగణంతో విచ్చేసి అందంగా నవ్వుతున్నట్లు ఆకాశం అంతా ఒకటే వెలుగు పువ్వులు.

నువ్వు, నిండు జాబిలే నేలకు దిగివచ్చినట్లు,
మన ఇసుక తోటలో వెండి వెన్నెల్లో పచ్చగా మెరిసిన పుచ్చ పువ్వులా,
బుజ్జి పాపాయి లేతపాదాలతో తుళ్ళుతూ నడుస్తున్నట్లు నావైపు వస్తున్నావు.

ఆ బ్రహ్మ ముహుర్తానా, మహోగ్రరూపమై దేదీప్యమానంగా వెలుగొందుతున్న అగ్ని సాక్షిగా,
ఆత్మీయుల నడుమ,

ఈ పసిమి పసిడిని, చిట్టి పాపాయిని చూస్తున్న వేళలో..................
ఓం శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిదిష్టతి....
.....................................................................................
...........................................................

No comments:

Post a Comment